ద్వారక ఆలయంలో ముఖేశ్‌ అంబానీ ప్రత్యేక పూజలు

  • దేవ్ భూమిని దర్శించుకున్న ముఖేశ్ అంబానీ
  • కుమారుడు అనంత్ తో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు
  • తీర్థ ప్రసాదాలను అందజేసిన ఆలయ అర్చకులు
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ద్వారకలోని దేవ్ భూమిని దర్శించుకున్నారు. శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్వారకాధీశుని పాదాలకు నమస్కరించి ప్రత్యేక పూజలు చేశారు. తన కుమారుడు అనంత్ అంబానీతో కలసి ఆయన స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖేశ్, అనంత్ అంబానీలను ఆలయ నిర్వాహకులు శాలువాలు కప్పి స్వాగతించారు. దర్శనానంతరం అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Mukesh Ambani
Dwaraka
Dev Bhoomi

More Telugu News